ఎఫ్ఏక్యూ

టెక్నాలజీ కష్టంగా ఉండవచ్చు. కొన్ని సాధారణ ప్రశ్నలకి ఇక్కడ సమాధానాలు ఉన్నాయి.

మీ మొబైల్ ని ప్రారంభించటం

నా ఫోన్ ఎందుకు స్టార్ట్ కావటం లేదు?

ఫోన్ బ్యాటరీ అయిపోయి ఉండటం వల్ల ఇలా జరిగి ఉండవచ్చు. మీ ఫోన్ ని 10-15 నిముషాలు ఛార్జ్ చేయండి. మళ్లీ స్విచ్ ఆన్ చేయటానికి ప్రయత్నించండి. బ్యాటరీ ఐకాన్ పై ఎర్రటి రంగు గల చిహ్నం కనిపించటానికి ముందే మీరు మీ ఫోన్ ని ఛార్జ్ చేయాలి.

సాధారణ చర్యలు

స్క్రీన్ బ్రైట్ నెస్ ని నేను ఎలా తగ్గించగలను?

పుల్-డౌన్ మెనూ ఉపయోగించి బ్రైట్ నెస్ ఆప్షన్ పై ట్యాప్ చేయండి. మీ అవసరాలకు తగినట్లుగా బ్రైట్ నెస్ ని తగ్గించండి.

నేను ఫోన్ వాల్యూం ఎలా నియంత్రించగలను?

సౌండ్ వాల్యూంని నియంత్రించటానికి ఫోన్ ప్రక్కన ఉండే వాల్యూం ని నియంత్రించే బటన్ ఉపయోగించాలి. యూ ట్యూబ్ వీడియోల వాల్యూంని కూడా నియంత్రించటానికి మీరు ఈ బటన్ ని ఉపయోగించవచ్చు.

ఇంటర్నెట్ కి కనెక్ట్ అవుతోంది

నా ఇంటర్నెట్ ఎందుకు పని చేయటం లేదు?

సెట్టింగ్స్ వెళ్లండి మరియు మొబైల్ డేటాపై ట్యాప్ చేయండి. అది ఆఫ్ అయి ఉంటే, మీ ఇంటర్నెట్ పని చేయదు. ఆన్ చేయటానికి దానిపై ట్యాప్ చేయండి.

నా ఇంటర్నెట్ పగటి పూట ఎన్నోసార్లు పని చేయటం మానివేసింది. నేను ఏమి చేయాలి?

ఇంటర్నెట్ సిగ్నల్ బలహీనంగా ఉన్న ప్రాంతంలో కొన్నిసార్లు మీరు ఉండవచ్చు. సిగ్నల్ బలంగా ఉన్న ప్రాంతానికి వెళ్లటానికి ప్రయత్నించండి.

నేను నా డేటా ప్యాక్ ని ఎలా రీఛార్జ్ చేయాలి?

ఫోన్ డేటా రీఛార్జ్ ప్యాక్స్ విక్రయించే దుకాణాన్ని సందర్శించండి. మీరు సబ్ స్క్రైబ్ చేసుకునే సర్వీస్ ప్రొవైడర్ డేటా ప్యాక్ గురించి అడగండి. మీ అవసరాలకు తగిన రీఛార్జ్ ప్యాక్ కొనండి.

ఇంటర్నెట్ ని ఉపయోగించటం

వై-ఫై అనగా ఏమిటి?

వై-ఫై అనేది వైర్ లెస్ ఇంటర్నెట్ కనెక్షన్. అది ఒక నిర్దిష్టమైన ప్రదేశానికే పరిమితమవుతుంది. మీ టెలివిజన్ కోసం కేబుల్ ఆపరేటర్స్ మాదిరి వంటిది. వై-ఫై కనెక్షన్ శ్రేణి ఒక ప్రాంతానికి పరిమితం. మీరు ఆ ప్రాంతం లోపల ఉన్నప్పుడు, మీరు వై-ఫై ద్వారా మీ ఫోన్ పై ఇంటర్నెట్ కి కనెక్ట్ కాగలరు.

గూగుల్ సెర్చ్ ద్వారా నాకు కావల్సిన సమాచారాన్ని నేను కనుగొనలేకపోతున్నాను.

గూగుల్ సెర్చ్ ప్రభావవంతంగా ఉండటానికి, మీరు సెర్చ్ చేయాలనుకునే అవసరానికి తగిన విధంగా మీరు ఉపయోగించే పదాలు ఉండాలి. పదాలు ఎంత దగ్గరగా ఉంటే, ఫలితాలు మీ అవసరాలకు తగినట్లుగా ఉంటాయి.

నేను కోరుకునే ఫలితాల్ని వాయిస్ సెర్చ్ నాకు ఇవ్వటం లేదు . నేను ఏమి చేయాలి?

వాయిస్ సెర్చ్ ప్రభావవంతంగా ఉండటానికి, సాధ్యమైనంత స్పష్టంగా మాట్లాడండి. మాట్లాడేటప్పుడు తెలియని శబ్దాలు ఉపయోగించకుండా జాగ్రత్తపడండి. మీ సెర్చ్ సాద్యమైనంత నిర్దిష్టంగా ఉంటే ఇది సహాయపడుతుంది. ప్రస్తుతం, వాయిస్ సెర్చ్ పై కేవలం హిందీ, ఇంగ్లిష్ భాషల సెర్చ్ లు మాత్రమే లభిస్తున్నాయి.

ఇంటర్నెట్ ని ఉపయోగించటానికి ఎంత ఖర్చు అవుతుంది?

మీరు ఇంటర్నెట్ ని ఉపయోగించేటప్పుడు, మీరు డౌన్ లోడ్ చేసుకునే డేటాకి మీ నుంచి సొమ్ము వసూలు చేయబడుతుంది. డౌన్ లోడ్ విషయాలు ఎంత భారీగా ఉంటే డేటా ఖరీదు అంత ఎక్కువగా ఉంటుంది. టెక్ట్స్ డౌన్ లోడ్ చేసుకోవటానికి డేటా ఛార్జీలు అతి తక్కువగా ఉంటే, వీడియోలు డౌన్ లోడ్ చేసకోవటానికి ఛార్జీలు ఎక్కువగా ఉంటాయి. యాప్స్, ఇమేజెస్, డాక్యుమెంట్స్ మరియు మ్యూజిక్ డౌన్ లోడ్స్ చేసుకోవటానికి కూడా డేటా ఛార్జీలు వర్తిస్తాయి.

గూగుల్ సెర్చ్ ని ఉపయోగిస్తూ నేను ఒక ఇమేజ్ ని ఎలా సెర్చ్ చేయాలి?

కీవర్డ్ టైప్ చేసి మరియు సెర్చ్ ట్యాప్ చేయండి. మీరు ఫలితాలు చూస్తారు. ఇప్పుడు ఇమేజెస్ ట్యాప్ చేయండి. మీ సెర్చ్ కి సరిపోయే ఇమేజెస్ ని గూగుల్ చూపిస్తుంది. ఇదే విధంగా మీరు వీడియోలు మరియు మ్యాప్స్ సెర్చ్ చేయవచ్చు.

కామ్, .ఇన్, .గవ్ వంటి వెబ్ సైట్ ఎక్స్ టెన్షన్స్ కి అర్థం ఏమిటి?

గవ్, .ఎన్ఐసి తో అంతమయ్యే సైట్స్ ప్రభుత్వానికి సంబంధించినవి మరియు సాధారణంగా ఖచ్చితమైన మరియు నమ్మకమైన సమాచారాన్ని అందిస్తాయి. .కామ్ వంటి సైట్ ఎక్స్ టన్షన్స్ సాధారణం మరియు సాధారణంగా కంపెనీకి చెందుతాయి. .ఇన్ ఎక్స్ టెన్షన్ భారతదేశంలో కంపెనీని సూచిస్తాయి.

యాప్స్ ప్రాథమికాంశాలు

నా స్క్రీన్ పై ఎన్నో యాప్స్ ఉన్నాయి. నేను వాటిని ఎలా నిర్వహించుకోగలను?

ఒక పేజీ నుంచి మరొక పేజీకి మీరు యాప్స్ ని మువ్ చేయవచ్చు. అలా చేయటానికి, యాప్ పై ఎక్కువసేపు నొక్కి ఉంచి మీ ఫోన్ స్క్రీన్ మూలకి డ్రాగ్ చేయాలి. సక్రమమైన ప్రదేశంలో మీరు యాప్ విడుదల చేసే మీ ఫోన్ పై తదుపరి పేజీలో కనిపిస్తుంది.

నా యాప్ పని చేయటం లేదు. నేను ఏమి చేయాలి?

చాలా యాప్స్ ఏక్టివ్ గా ఉన్నప్పుడు ఇది జరుగుతుంది. అనవసరమైన యాప్స్ క్లోజ్ చేయటానికి, ఏక్టివ్ యాప్స్ ఉపయోగించటానికి మీ ఫోన్ ని రిస్టార్ట్ చేయాలి.

నేను నా ఫోన్ పై యాప్ ఇన్ స్టాల్ చేయలేకపోతున్నాను. నేను ఏమి చేయాలి?

మీ ఫోన్ లో కావల్సినంత మెమొరి లేకపోతే మీ యాప్స్ ఇన్ స్టాల్ కాలేవు. సెట్టింగ్స్ కి వెళ్లండి, యాప్స్ పై ట్యాప్ చేయండి. లభ్యమవుతున్న మెమొరిని తనిఖీ చేయండి. కొన్ని వీడియోలు మరియు ఫోటోగ్రాఫ్ ల్ని డిలీట్ చేయటం వల్ల మీ యాప్స్ ని ఇన్ స్టాల్ చేయటానికి కొంత మెమొరిని కల్పిస్తాయి. డిలీట్ చేసే ఫోటోలు మరియు వీడియోల టాపిక్ సమీక్షించండి.

వీడియో కాలింగ్

రెగ్యులర్ మొబైల్ ఆధారంగా చేసే కాల్ కి మరియు గూగుల్ హ్యాంగవుట్స్ కాల్ కి మధ్య తేడా ఏంటి?

గూగుల్ గ్యాంగవుట్స్ కాల్ ఉచితం. కాల్ సమయంలో మీరు వినియోగించే డేటాకి మాత్రమే మీరు చెల్లిస్తారు.

ఇంటర్నెట్ భద్రత

ఇంటర్నెట్ సురక్షితమైనదా?

ఇంటర్నెట్ అనేది నిజమైన ప్రపంచం మాదిరిగా ఉండే వర్ట్యువల్ ప్రపంచం. నిజమైన ప్రపంచంలో మీరు జాగ్రత్తలు తీసుకుంటున్న విధంగానే ఈ వర్ట్యువల్ ప్రపంచంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. బలమైన పాస్ వర్డ్స్ ని కలిగి ఉండటం, ఎవరితోను పంచుకోకపోవటం మరియు మిమ్మల్ని మరియు మీ డేటాని సురక్షితంగా ఉంచటానికి గూగుల్ కేటాయించే సమాచారం మరియు పద్ధుతుల్ని ఉపయోగించాలి.

బలమైన పాస్ వర్డ్ అంటే అర్థం ఏంటి?

బలహీనమైన పాస్ వర్డ్ సాధారణ పదాలైన పాస్ వర్డ్ 12345678 లేదా సాధారణ నిఘంటువు పదాల్ని ఉపయోగిస్తుంది. దుర్వినియోగం చేయటానికి వీటిని ఇతరులు సులభంగా ఊహిస్తారు. బలమైన పాస్ వర్డ్స్ అనగా కేవలం మీకు మాత్రమే తెలిసిన పదాలు ( మీరు 4వ తరగతిలో ఉన్నప్పుడు మీ టీచరు పేరు వంటివి), ఇతరులు ఊహించటానికి కష్టంగా ఉండేవి మరియు అంకెలు, అక్షరాల మిశ్రమాన్ని ఉపయోగించండి.

నేను బలమైన పాస్ వర్డ్ ని తయారు చేయటం ఎలా?

మీకు తెలిసిన పదజాలాన్ని మాత్రమే ఉపయోగించి పాస్ వర్డ్ తయారు చేయండి. అప్పర్, లోయర్ కేస్ అక్షరాల మిశ్రమం, నంబర్లు, చిహ్నాల మిశ్రమాన్ని ఉపయోగించటం వల్ల మీ పాస్ వర్డ్ ని ఊహించటం కష్టం. మీ పాస్ వర్డ్స్ ని ఎవరితోను చెప్పవద్దు.

ఒక అటాచ్ మెంట్ తో ఒక కొత్త వ్యక్తి నాకు ఈమెయిల్ పంపిచాడు. దాన్ని తెరవటం సురక్షితమేనా?

మీ ఫోన్ లేదా మీ డేటాకి హాని కలిగించే కొన్ని అటాచ్మెంట్స్ ని కొన్ని ఈమెయిల్స్ కలిగి ఉంటాయి. కొత్తవారి నుంచి వచ్చే ఈమెయిల్స్ ని తెరవవద్దు. అటాచ్మెంట్స్ తెరవవద్దు లేదా అటువంటి ఈమెయిల్స్ లో ఎటువంటి లింక్స్ ని ట్యాప్ చేయవద్దు.

నాకు భారీ మొత్తం ఆఫర్ చేసే ఈ మెయిల్ నాకు వచ్చింది. నేను ఏమి చేయాలి?

మీ పూర్తి పేరు, టెలీఫోన్ నంబర్, బ్యాంక్ ఖాతా నంబర్ మరియు పిన్ నంబర్ వంటి మీ వ్యక్తిగత సమాచారాన్ని కేటాయించినందుకు భారీ మొత్తంలో చెల్లిస్తామని కొన్ని ఈమెయిల్స్ వాగ్ధానాలు చేస్తాయి. వ్యక్తిగత సమాచారాన్ని ఎన్నడూ ఎవరితో పంచుకోవద్దు మరియు అటువంటి ఈమెయిల్స్ ని డిలీట్ చేయండి.